Header Banner

సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకి షాక్‌! స్టే నిరాకరణ.. విచారణకు హాజరుకావాల్సిందే!

  Thu May 01, 2025 10:01        Politics

తెలుగు సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపకుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2019లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో జాప్యం గురించి ఆందోళన చేపట్టారనే కేసు విచారణపై స్టే ఇవ్వాలని నటుడు మోహన్‌ బాబు తిరుపతి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. మే 2న విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని తేల్చిచెప్పింది. ఇక, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మోహన్ బాబు కాలేజీ నడుపుతున్న 75 సంవత్సరాల వ్యక్తి అని.. ప్రైవేట్ వ్యక్తులపై ఎన్నికల ప్రవర్తనా నియామవాళి వర్తించదని మోహన్ బాబు తరపు న్యాయవాది వాదించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం తాము చేసిన ధర్నా ఎంసీసీ పరిధిలోకి రాదని.. చార్జ్‌షీట్‌లోనూ ఎంసీసీ ఉల్లంఘన కేసు తమపై మోపారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇక ఈ కేసులో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు.. మోహన్‌ బాబు శుక్రవారం విచారణకు హాజరు కావలసిందేనని తేల్చి చెప్పింది. మోహన్ బాబు ఆందోళన ఏంటి.. 2014 నుంచి 2019 వరకు ఏపీ ప్రభుత్వం నుంచి తమ సంస్థ శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌ మెంట్ బకాయిలు ఏపీ ప్రభుత్వం చెల్లించలేదని తిరుపతి-మదనపల్లె జాతీయ రహదారిపై నటుడు మోహన్ బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ విద్యార్థులతో కలిసి బైఠాయించి ఆందోళన చేశారు. అయితే అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు మోహన్ బాబుపై కేసు నమోదు చేశారు.

రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని, ధర్నాకు ముందస్తుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని పలు సెక్షన్ల కింద వీరిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్‌ మెంట్ చేయకపోవడం వల్ల తమ సంస్థ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, సంస్థ సిబ్బందికి జీతాలు చెల్లించడానికి బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చిందన్ని మోహన్ బాబు అన్నారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వై.ఎస్. రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించబడేదని, కానీ 2014లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వంలో పరిస్థితి మారిపోయిందని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: ప్లాట్ కొనుగోలుదారులకు భారీ ఊరట..! రిజిస్ట్రేషన్ ఫీజు తగ్గించిన ఏపీ ప్రభుత్వం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారిడీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #MohanBabu #SupremeCourt #StayPetitionRejected #LegalSetback #CourtHearing #ElectionCodeCase #TollywoodNews